బట్టల వ్యాపారిని నడి రోడ్డుపై పొడిచి చంపారు

Published : Apr 28, 2019, 01:07 PM IST
బట్టల వ్యాపారిని నడి రోడ్డుపై పొడిచి చంపారు

సారాంశం

: 23 ఏళ్ల వ్యక్తి మహ్మద్ అమిర్‌ఖాన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మొఘల్‌పుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

హైదరాబాద్: 23 ఏళ్ల వ్యక్తి మహ్మద్ అమిర్‌ఖాన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మొఘల్‌పుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 బట్టల వ్యాపారం చేసే  మహ్మద్ అమిర్‌ఖాన్‌  బాలాపూర్‌లోని ఎర్రకుంటలో నివాసం ఉండేవాడు. ఈ నెల 26వ తేదీ రాత్రి బైక్‌పై వెళ్తుండగా 10.45 గంటలకు  ఇద్దరు వ్యక్తులు అతడిని ఆపి కత్తులతో పొడి చంపారు.

 సయ్యద్  షాహీద్, సయ్యద్ ఐజాజ్‌లు బట్టల వ్యాపారి అమిర్‌ఖాన్‌ను చంపారని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాహీద్, ఐజాజ్‌లు  రౌడీషీటర్లని పోలీసులు చెప్పారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే అమిర్‌ఖాన్‌ను హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?