RTC Strike:జేఎసీ నేతల భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన

By narsimha lodeFirst Published Nov 3, 2019, 11:47 AM IST
Highlights

ఆర్టీసీ కార్మికుల జేఎసీ ఆదివారం నాడు సమావేశమైంది. భవిష్యత్తు కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

ఆర్టీసీ జేఎసీ నేతలు ఆదివారం నాడు సమావేశమయ్యారు. తెలంగాణ కేబినెట్ సమావేశం, సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో  అనుసరించాల్సిన వ్యూహంపై జేఎసీ నేతలు చర్చిస్తున్నారు.

ఈ నెల 5వ తేదీ లోపుగా  ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ చివరి అవకాశాన్ని ఇచ్చారు.అక్టోబర్ 5వ తేదీన ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను ప్రారంభించారు.

ఆర్టీసీ సమ్మె విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ తన పంతం వీడడం లేదు. ఈ నెల 5వ తేదీలోపుగా కార్మికులు విదుల్లో చేరాలని కోరారు. 5100 రూట్లను ప్రైవేట్ పరం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. కార్మికులు విధుల్లో చేరకపోతే మరిన్ని రూట్లను కూడ ప్రైవేట్ పరం చేస్తామని సీఎం హెచ్చరించారు.

click me!