RTC Strike: గుండె పోటుతో డ్రైవర్ రమేష్ గౌడ్ మృతి

Published : Oct 23, 2019, 11:16 AM ISTUpdated : Oct 23, 2019, 11:37 AM IST
RTC Strike: గుండె పోటుతో  డ్రైవర్ రమేష్ గౌడ్ మృతి

సారాంశం

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు  రమేష్ గౌడ్   గుండెపోటుతో బుధవారం నాడు మృతి చెందాడు,. ఆర్టీసీ సమ్మెలో 18 రోజులుగా రమేష్ గౌడ్ చురుకుగా పాల్గొంటున్నాడని  ఆర్టీసీ జేఎసీ నేతలు తెలిపారు. 

హైదరాబాద్: మరో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో బుధవారంనాడు ఉదయం మృతి చెందాడు. రమేష్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ హైద్రాబాద్ ముషీరాబాద్-1 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెలో 18 రోజులుగా రమేష్ గౌడ్ చురుకుగా పాల్గొంటున్నాడు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన సిద్దగోని రమేష్ గౌడ్ బుధవారం నాడు గుండెపోటుతో  మృతి చెందినట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మె సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు మృతి చెందారు. ఖమ్మండి డిపో కు చెందిన డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. హైద్రాబాద్ కు చెందిన సురేందర్ గౌడ్  గుండెపోటుతో మృతి చెందాడు.

హైద్రాబాద్ హెఛ్‌సీయూలో పనిచేస్తున్న డ్రైవర్ సందీప్ కూడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్మికులు ఎవరూ కూడ ఆత్మహత్యకు పాల్పడకూడదని జేఎసీ నేతలు కోరారు. ఇదే విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడ ఆర్టీసీ జేఎసీ నేతలకు సూచించారు. 

సమ్మె విషయంలో ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన వస్తోందో రాదోననే దిగులుతో రమేష్ గౌడ్ ఉన్నారని  ఆర్టీసీ జేఎసీ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే రమేష్ గౌడ్ దిగులుతో గుండెపోటుకు గురై మృతి చెందినట్టుగా జేఎసీ నేతలు చెబుతున్నారు. 

ఈ నెల 5 వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. ఇందులో ప్రధానమైన  ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం అనేది ప్రధానమైంది.

అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి సానుకూలంగా స్పందించారు. 21 డిమాండ్లపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశారు.

Read more  అమ్మా చొరవచూపండి: గవర్నర్ తమిళసైతో టీఎస్ఆర్టీసీ జేఏసీ భేటీ...

 Read more  కేసీఆర్ మొండిపట్టు, జేఎసీ నేతలకు తమిళిసై దిక్కు...

Read more   జీతాల చెల్లింపుపై చేతులెత్తేసిన కేసీఆర్ ప్రభుత్వం...

Read more   భయపడొద్దు, ప్రభుత్వంతో మాట్లాడుతా: ఆర్టీసీ జేఎసీ నేతలతో తమిళిసై...

Read more  కేసీఆర్ సమావేశం, ఏం చేస్తారు?...

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu