RTC strike: టిఆర్ఎస్ నేతల్లో కొత్త ఆందోళన...

By telugu teamFirst Published Oct 26, 2019, 3:31 PM IST
Highlights

హుజూర్ నగర్ ఎన్నిక పూర్తయినా తెరాస నేతలు మాత్రం ఇంకా ఆర్టీసీ సమ్మె గురించి భయపడడం మానలేదు. ఎంత త్వరగా సమసిపోతే అంత బాగుండు ఈ సమస్య అని వారంతా అనుకుంటున్నారు. కెసిఆర్ ఘీంకరిస్తున్నా, వారెందుకు ఇంతలా భయపడుతున్నారు?

ఆర్టీసీ సమ్మె త్వరగా ముగియాలని ఈ సమస్య సమసిపోవాలని తెరాస నేతలందరూ బలంగా కోరుకుంటున్నారా. మొన్నటి హుజూర్ నగర్ ఉప ఎన్నికపైన్నే ఈ సమ్మె ప్రభావం ఎక్కడ పడుతుందోమో అని తెగ భయపడిపోయారు. కానీ అదృష్టవశాత్తు దాని ప్రభావం మచ్చుకైనా కనపడకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కెసిఆర్ సార్ ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీసీ యూనియన్లను తులనాడుతూ ఘీంకరించాడు. 

హుజూర్ నగర్ ఎన్నిక అయిపోయినాక కూడా తెరాస నేతలంతా ఇంకా కూడా ఆర్టీసీ సమ్మె గురించి భయపడుతూనే ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. మొన్ననే కోర్ట్ మునిసిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్వహించేందుకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 

వచ్చే నెలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు ఇప్పుడు ఎమ్మెల్యేలకు ముఖ్య నాయకులకు పరీక్షగా మారిపోయాయి. ఉన్న డిపోల్లో అత్యధిక శాతం దాదాపు 90శాతం వరకు డిపోలు పట్టాన ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇలాంటి ఒక్కో డిపోలో 500 మంది కార్మికులు పనిచేస్తుంటారు. వారి కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే ఇంకో 1000 మంది. మొత్తంగా ఇంత మంది ప్రజలు క్రియాశీలకంగా మారి కేవలం వారి వార్డు వరకు వారి సమస్యలను ఇంటింటికెళ్లి చెప్పినా అది అధికార పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉంది. 

హుజూర్ నగర్ లో డిపో లేకపోవడం తెరాస కు ఒకింత కలిసొచ్చిన మాట వాస్తవం. కానీ ఎమ్మెల్యేలకు విషమ పరీక్షా అయిన మునిసిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఎందరో కార్మికులను వారి కుటుంబాలను ఎదుర్కోవలిసి రావడం ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు కలిగిస్తాయనడంలో నో డౌట్. 

ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 20 రోజులు దాటింది. జరిగేవేమో మునిసిపల్ ఎన్నికలు. పట్టణ ప్రాంత ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతంగా వినియోగిస్తారు. సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల సదరు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న మాట వాస్తవం. ఇటు ప్రభుత్వం కానీ అటు కార్మికులు కానీ పట్టు వీడే పరిస్థితుల్లో కనపడడం లేదు. సాధారణ ప్రజలకు గనుక ఇబ్బందులు ఎక్కువైతే అది ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీయొచ్చని గులాబీ దళం భయపడిపోతుంది. 

సాధ్యమైనంత త్వరగా ఈ ప్రతిష్టంభన తొలగిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని గులాబీ శ్రేణులు కోరుకుంటున్నారు. సమ్మె ఆగిపోతేనే తెరాస కు విజయావకాశాలు మెరుగుపడతాయని వారు భావిస్తున్నారు. సమ్మె గనుక కొనసాగితే బలమైన ప్రతిపక్షాలున్న చోట తెరాస కు ఇబబంధులు తప్పవు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ఉత్తర తెలంగాణాలో తెరాస కు గండిపడే ఆస్కారం ఉంది. ముఖ్యంగా రామగుండము,ఖమ్మ,నిజామాబాదు,కరీంనగర్ కార్పొరేషన్లలో తెరాస నష్టపోయే ప్రమాదం ఉంది. 

click me!