ఆర్టీసీ సమ్మె: చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

By narsimha lodeFirst Published Oct 13, 2019, 11:22 AM IST
Highlights

సమ్మె విషయంలో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఖమ్మండి డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి ఆదివారం  నాడు మృతి చెందాడు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోమని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో  శ్రీనివాస్ రెడ్డి శనివారం నాడు ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.మెరుగైన చికిత్స కోసం శ్రీనివాస్ రెడ్డిని హైద్రాబాద్‌ డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. 

ఈ నెల5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులుసమ్మె నిర్వహిస్తున్నారు.  శనివారం నాడు ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో  శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. శనివారం నాడు సాయంత్రం కిరోసిన్ పోసుకొని శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన కొడుకు కూడ గాయాలయ్యాయి.  90 శాతం శ్రీనివాస్ రెడ్డి శరీరం కాలిపోయింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ డిఆర్‌డిఓ  అపోలో ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు మృతి చెందాడు.

శ్రీనివాస్ రెడ్డి బౌతిక కాయాన్ని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి తో పాటు పలు పార్టీల నేతలు  సందర్శించి నివాళులర్పించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు  ప్రభుత్వం విధించిన గడువులోపుగా విధుల్లో చేరకపోవడంతో సెల్ప్ డిస్మిస్ అయినట్టు ప్రకటించారు.

"

click me!