లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపిన ఉన్మాది

Published : Oct 13, 2019, 07:26 AM ISTUpdated : Oct 13, 2019, 07:28 AM IST
లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపిన ఉన్మాది

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. తన  కుటుంబానికి చెందిన ముగ్గురిని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దోమకొండ శివారులోని మూడు హత్యలు కలకలకం సృష్టించాయి. అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని సహించలేక తమ్ముడు ముగ్గురిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

దోమకొండకు చెందిన బందెల బాలయ్య, బందెల రవిలు అన్నదమ్ములు. బాలయ్య పెద్ద కూతురు దీప అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొంది.

అయితే ఆ యువకుడు తన భార్య తరపు బంధువు. ఇది రవికి నచ్చలేదు.ఈ విషయమై గ్రామంలో పంచాయితీ కూడ పెట్టాడు రవి. అయితే గ్రామ పెద్దలు రవికి నచ్చజెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకొన్నారు.

భవిష్యత్తులో తమ ఇంట్లో ఇలాంటి ఘటనలు జరగకూడదని భావించారు. దీంతో పథకం ప్రకారం తన కుటుంబసభ్యులను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

ప్రేమ వివాహనికి అండగా నిలిచిన తన అన్నను కూడ చంపాలని రవి పన్నాగం వేశాడు. తన అన్న బాలయ్య రెండో కూతురు లత, తన  ఎనిమిదేళ్ల కూతురు చందన, తన సోదరుడు బాలయ్యను చంపాలని రవి ప్లాన్ చేశాడు.

ఈ పథకంలో భాగంగా ఈ ముగ్గురిని ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామంలోని మల్లిఖార్జున స్వామి ఆలయ పరిసరాలకు తీసుకెళ్లాడు.తనతో పాటు తెచ్చుకొన్న కూల్‌డ్రింక్ లో  పురుగుల మందును కలిపి బాలయ్య, లత, చందనలకు ఇచ్చాడు. దీంతో  ఆ ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. 

ఇదే అదనుగా చూసుకొన్న రవి బాలయ్య, లతల గొంతు కోశాడు.  చందన గొంతు కోసేందుకు ప్రయత్నించాడు.అయితే ఎనిమిదేళ్ల చందన అప్పటికే చనిపోవడంతో ఆమెను వదిలేశాడు.

ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్