Rtc Strike:దేవరకొండ డిపో డ్రైవర్ టీజేరెడ్డి మృతి

By narsimha lodeFirst Published Nov 4, 2019, 7:34 AM IST
Highlights

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ టీజే రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందాడు. గత నెల రోజుల నుండి టీజే రెడ్డి సమ్మెలో పాల్గొంటున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు.


దేవరకొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ డిపోకు చెందిన టీజే రెడ్డి (టి.జైపాల్ రెడ్డి) గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీ లోపుగా విధుల్లో చేరాలని డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే.

ఆర్టీసీ సమ్మె ప్రారంభమైననాటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సుమారు 20 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు మృతిచెందినట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు చెబుతున్నారు.

ఆదివారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆత్మకూరు గ్రామానికి చెందిన రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు.
ఆర్టీసీ కార్మికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు.

ఈ నెల 2వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 5100 రూట్లను ప్రైవేట్ పరం చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన రూట్లను కూడ ప్రైవేట్ పరం చేస్తామని హెచ్చరించారు.

also read:RTC Strike:ప్రభుత్వ ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశాలు

ఈ నెల 5వ తేదీలోపుగా కార్మికులు విధుల్లో చేరాలని డెడ్‌లైన్ విధించారు. ఈ డెడ్‌లైన్ తో కొందరు కార్మికులు విదుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 మంది ఆర్టీసీ కార్మికులు  తాము విధుల్లో చేరుతున్నట్టుగా సమ్మతి లేఖలను అందించారు. వీరిలో ఎక్కువ మంది తమ కుటుంబాల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విధుల్లో చేరినట్టుగా సమాచారం.

Also Read:కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై

ఆదివారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆత్మకూరు గ్రామానికి చెందిన రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు.
ఆర్టీసీ కార్మికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు. రవీందర్ అంత్యక్రియల విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

కుటుంబసభ్యులకు తెలియకుండానే అంత్యక్రియల ఏర్పాట్లు చేయడంపై ఆర్టీసీ జేఎసీ నేతలు మండిపడ్డారు.

click me!