కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది..

By Sumanth KanukulaFirst Published Aug 13, 2022, 2:08 PM IST
Highlights

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో అదుపు తప్పిన ఆర్టీసీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో అదుపు తప్పిన ఆర్టీసీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్‌‌కు బయలుదేరింది. అయితే కామారెడ్డి పాత కలెక్టరేట్‌ ఎదుట అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

click me!