కొడంగల్ లో టిఆర్ఎస్ కు భారీ షాక్

First Published Jan 9, 2018, 8:58 PM IST
Highlights
  • రేవంత్ తో చేతులు కలిపిన గుర్నాథ్ కుటుంబం
  • కొడంగల్ ను ఏలిన గుర్నాథ్ రెడ్డి చేతులు కట్టుకుని ఉండాలా?
  • నరేందర్ రెడ్డి కింద పనిచేయాల్సి రావడం బాధాకరం

కొడంగల్ లో ఒకవైపు రేవంత్ ను చిత్తు చేసేందుకు అధికార టిఆర్ఎస్ పార్టీ కత్తులు నూరుతుంటే మరోవైపు అంతే వేగంగా రేవంత్ తన వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేయడమే కాదు.. అధికార పార్టీకి ఊహించని షాక్ లు ఇస్తున్నారు. కొడంగల్ ఉప ఎన్నిక వస్తదా? రాదా అన్న మీమాంస ఒకవైపు ఉంటే మరోవైపు కొడంగల్ లోఎవరి వ్యూహాల్లో వారు బిజీ అయిపోయారు.

తాజాగా కొడంగల్ లో టిఆర్ఎస్ కు భారీ షాక్ తగలింది. దశాబ్దాల కాలంగా కొడంగల్ ను ఏలిన ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ప్రస్తుతం టిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. అయితే ఆయనకు ఒకవేళ ఎన్నికలు వస్తే టికెట్ వస్తుందా రాదా అన్న మీమాంస ఉంది. ఆయన తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అనూహ్యంగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి సీన్ లోకి ఎంటర్ అయ్యారు. దీంతో గుర్నాథ్ రెడ్డి ఫ్యామిలీ ఆందోళనలో పడిపోయింది. ఈ నేపథ్యంలో గుర్నాథ్ రెడ్డి సోదరుడి కుమార్తె ఆనం ఎ. రెడ్డి, కొడుకు ఇద్దరూ రేవంత్ ను కలిసి మద్దతు ప్రకటించారు. వారితోపాటు గుర్నాథ్ రెడ్డి కుటుంబసభ్యులు కూడా రేవంత్ కు జై కొట్టారు.

కొడంగల్ లో నరేందర్ రెడ్డి ఆధిపత్యం పెరిగిపోతోందని, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని గుర్నాథ్ ఫ్యామిలీ ఆరోపిస్తున్నారు. కొడంగల్ ను దశాబ్దాల కాలంగా ఏలిన తమ తండ్రి గురునాథ్ రెడ్డి కూడా నరేందర్ రెడ్డి వెంబడి చేతులు కట్టుకొని తిరగడం తమకు తమ అనుచరులకు మింగుడు  పడడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులమని ఇక నుంచి మీతో కలిసి పనిచేస్తాం అని, సంక్రాంతి తరువాత కొడంగల్ నుంచి భారీ ర్యాలీగా వచ్చి రేవంత్ సమక్షం లో కాంగ్రెస్ లో కలుస్తున్నట్లు తెలిపారు. వీళ్ళు రేవంత్ రెడ్డి ని కలవడం తో కొడంగల్ లో సుమారు 30 గ్రామాల్లో టిఆర్ఎస్ ఖాళీ అవుతున్నట్లుగా రేవంత్ అనుచరులు చెబుతున్నారు.

మొత్తానికి ప్రత్యర్థి ఫ్యామిలీ రేవంత్ తో చేతులు కలపడం చూస్తే... టిఆర్ఎస్ కు నిజంగా భారీ షాక్ గానే చెప్పవచ్చని అంటున్నారు. మరి ఈ వ్యూహాన్ని అధికార టిఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.

click me!