సుబ్బరామిరెడ్డి బంధువుల ఇంట్లో రూ. 3 కోట్ల ఆభరణాలు చోరీ

Published : Aug 27, 2019, 01:18 PM ISTUpdated : Aug 27, 2019, 01:41 PM IST
సుబ్బరామిరెడ్డి బంధువుల ఇంట్లో రూ. 3 కోట్ల ఆభరణాలు చోరీ

సారాంశం

ఎంపీ సుబ్బరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 3 కోట్ల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

హైదరాబాద్: హైద్రాబాద్ బంజరాహిల్స్ లోని ఎంపీ సుబ్బరామిరెడ్డి బంధువుల ఇంట్లో రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ రెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది.  రెండు కోట్ల విలువైన వజ్రాలు, కోటి విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

సోమవారం రాత్రి ఉత్తమ్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వాచ్‌మెన్ తో పాటు చుట్టుపక్కల వారిని పోలీసులు విచారిస్తున్నారు.

ఈ ప్రాంతంలో నిత్యం  రద్దీగా ఉంటుంది. అంతేకాదు సెక్యూరిటీ కూడ ఉంటుంది. సీసీ కెమెరా పుటేజీని కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కాలనీకి  ఎవరెవరు వెళ్లారు... ఎవరెవరు వచ్చారనే విషయమై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో  పోలీసులు క్లూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని  పోలీసులు అనుమానిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?