దీపం వత్తులు, బొట్టు బిళ్లల మెషీన్ల స్కాం: రమేష్ రావు రిమాండ్ కు తరలింపు

By narsimha lodeFirst Published Dec 2, 2022, 11:05 PM IST
Highlights

దీపం వత్తులు, బొట్టు బిళ్లల మెషీన్ స్కాంలో  నిందితుడు  ఆర్ఆర్  ఎంటర్ ప్రైజెస్ కి చెందిన రమేష్ రావును పోలీసులు మల్కాజిగిరి కోర్టులో  హాజరుపర్చారు. చర్లపల్లి జైలుకు రమేష్ రావును తరలించారు.
 

హైదరాబాద్:దీపం వత్తులు, బొట్టు బిళ్లల మెషీన్ల పేరుతో  మోసం చేసిన కేసులో  రమేష్ రావును పోలీసులు మల్కాజిగిరి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. జడ్జి రిమాండ్‌కు పంపారు. నిందితుడు రమేష్ రావును చర్లపల్లి జైలుకు తరలించారు.దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో మోసం చేసిన ఆర్ఆర్ ఎంటర్‌ప్రైజెస్  కు చెందిన రమేష్ రావును  రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గత నెల 30న అరెస్ట్  చేశారు.  ఉపాధి దొరుకుతుందని  ఈ  మెషీన్లను అంటగట్టిన రమేష్ రావు  మోసానికి పాల్పడ్డాడు. ఈ రకంగా సుమారు రూ. 250 కోట్లను రమేష్ రావు మోసానికి పాల్పడ్డాడు.  

also read:దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో రూ. 250 కోట్ల స్కాం: చిలకలూరిపేటలో రమేష్ రావు అరెస్ట్

గత నెల 28న బాధితులు ఎఎస్‌రావునగర్ లోని ఆర్ఆర్ ఎంటర్ ప్రైజెస్ వద్ద ఆందోళనకు దిగారు. అంతేకాదు బాధితులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో రమేష్ రావుపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడు  రమేష్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేటలో ఉన్న సమయంలో  పోలీసులు అరెస్ట్  చేశారు.రమేష్ రావును పోలీసులు  మల్కాజిగిరి  కోర్టులో హాజరుపర్చారు. జడ్జి రమేష్ రావును 14 రోజుల పాటు రిమాండ్ కు పంపారు. చర్లపల్లి  జైలుకు పంపారు.
 

click me!