చెప్పినట్లే చేశాడు: యువతిపై రౌడీ‌షీటర్ దాడి, అడ్డుకోబోయిన అమ్మమ్మని...?

Siva Kodati |  
Published : Jan 02, 2020, 04:27 PM IST
చెప్పినట్లే చేశాడు: యువతిపై రౌడీ‌షీటర్ దాడి, అడ్డుకోబోయిన అమ్మమ్మని...?

సారాంశం

ఖమ్మం జిల్లాలో న్యూఇయర్ నాడు దారుణం జరిగింది. ఓ యువతిపై ఓ యువకుడు హత్యాయత్నం చేయడంతో పాటు ఈ దారుణానికి అడ్డుకోబోయిన ఆమె అమ్మమ్మపై సైతం కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.

ఖమ్మం జిల్లాలో న్యూఇయర్ నాడు దారుణం జరిగింది. ఓ యువతిపై ఓ యువకుడు హత్యాయత్నం చేయడంతో పాటు ఈ దారుణానికి అడ్డుకోబోయిన ఆమె అమ్మమ్మపై సైతం కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.

వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ వృద్ధురాలు తన మనవరాలితో కలిసి నివసిస్తోంది. ఆ యువతి ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. రోజు కాలేజీకి నడుచుకుంటూ వెళ్లి, ఇంటికి తిరిగొచ్చేది.

ఈ క్రమంలో ప్రేమ్‌కుమార్ అనే రౌడీషీటర్ నెల రోజులుగా ఆమె వెంటపడుతూ.. విద్యార్ధినితో అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు. తన జోలికి రావొద్దని ఆమె హెచ్చరించినప్పటికీ, చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు.

Also Read:సీఎంగా కేటీఆర్... ముహూర్తం ఎప్పుడు?

దీంతో ఆ యువతి విషయాన్ని ఇంట్లో చెప్పడంతో జాగ్రత్తలు చెప్పి ధైర్యం కల్పించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విద్యార్ధిని, ఆమె అమ్మమ్మతో కలిసి స్థానికులతో కలిసి న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.

సరిగ్గా ఇదే సమయంలో అక్కడికొచ్చిన ప్రేమ్‌కుమార్ ముందుగా యువతిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన వృద్ధురాలి పొట్ట, ఛాతీ భాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో భయపడిపోయిన ఆ యువతి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

Also Read:కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్: కవిత

దీనిని గమనించిన స్థానికులు ప్రేమ్‌కుమార్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా... అతడు కత్తిని చూపించి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?