హైదరాబాద్ : చాదర్‌ఘాట్‌లో ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. స్థానికులు పరుగులు, పోలీసులు అలెర్ట్

Siva Kodati |  
Published : Feb 10, 2023, 02:34 PM IST
హైదరాబాద్ : చాదర్‌ఘాట్‌లో ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. స్థానికులు పరుగులు, పోలీసులు అలెర్ట్

సారాంశం

హైదరాబాద్‌లో మరోసారి రోడ్డు కుంగింది. చాదర్‌ఘాట్ ప్రధాన రహదారిపై పెద్ద గుంత పడింది. పోలీసుల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. 

హైదరాబాద్‌లో మరోసారి రోడ్డు కుంగింది. చాదర్‌ఘాట్ ప్రధాన రహదారిపై పెద్ద గుంత పడింది. రోడ్డు మధ్య గుంత ఏర్పడటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. పోలీసుల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. 

కొద్దిరోజుల క్రితం హిమాయత్‌నగర్‌లోనూ రోడ్డు కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్టానిక స్ట్రీట్ నెంబర్ 5లో వున్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో నిలిపివున్న ట్రక్కు పది అడుగుల లోతులో కూరుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. 

ఇకపోతే .. గతేడాది డిసెంబర్‌లో గోషామహల్  చాక్నవాడిలోనూ పెద్దనాలా కుంగిపోయింది. ఈ నాలాలో  కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, దుకాణాలు పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 1980, 1990లలో  కూడా  ఈ నాలా  కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. అఫ్సర్ సాగర్, దారుసలాం, చాక్నవాడి , గోషామహల్  పోలీస్ స్టేడియం, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా  మురికి నీరు  ప్రవహించనుంది. ఇష్టానుసారంగా  ఈ నాలాపై ఆక్రమ నిర్మాణాలు వుండటం వల్లే నాలా కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?