ఔటర్‌పై రెండు కార్లు ఢీ: డివైడర్‌ మీదకు దూసుకెళ్లి.. మరో కారుని ఢీకొట్టి

Siva Kodati |  
Published : Jun 17, 2019, 10:27 AM IST
ఔటర్‌పై రెండు కార్లు ఢీ: డివైడర్‌ మీదకు దూసుకెళ్లి.. మరో కారుని ఢీకొట్టి

సారాంశం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి అత్తిలికి చెందిన విశ్వంత్, నారాయణ, కృష్ణ, గణేశ్‌లు కారులో హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా స్వగ్రామానికి బయలుదేరారు. 

ఇక అత్తిలికే చెందిన బాల వెంకట సుబ్రమణ్యం కారులో హైదరాబాద్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్ పరిధిలోని హామీదుల్లానగర్‌ సమీపంలోకి రాగానే సుబ్రమణ్యం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపుకు దూసుకెళ్లింది.

అక్కడితో ఆగకుండా ఎదురుగా వస్తున్న విశ్వంత్ కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యంతో పాటు విశ్వంత్, నారాయణ, కృష్ణలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాల వెంకట సుబ్రమణ్యం మరణించాడు. మృతి చెందిన వ్యక్తి.. గాయపడిన వారు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన వారే కావడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ