నాప్కిన్‌లు కింద పడేశారని.. యువకులను చితకబాదిన పబ్ బౌన్సర్లు

Siva Kodati |  
Published : Jun 17, 2019, 09:22 AM IST
నాప్కిన్‌లు కింద పడేశారని.. యువకులను చితకబాదిన పబ్ బౌన్సర్లు

సారాంశం

హైదరాబాద్ పబ్‌లలో మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. నాప్కిన్‌ను కింద పడేసినందుకు 9 మంది యువకులను బౌన్సర్లు చితకబాదారు.

హైదరాబాద్ పబ్‌లలో మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. నాప్కిన్‌ను కింద పడేసినందుకు 9 మంది యువకులను బౌన్సర్లు చితకబాదారు.  వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ పరిథిలోని ఆమ్నీషియా లాంజ్ పబ్‌లో స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు కొందరు యువకులు వెళ్లారు.

ఈ క్రమంలో వాష్‌రూమ్‌కి వెళ్లిన వారు అనుకోకుండా నాలుగు నాప్కిన్‌లు కిందపడేశారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న బౌన్సర్లు యువకులను బూతులు తిట్టారు. దీంతో వారు వాగ్వాదానికి దిగారు..

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బౌన్సర్లు తోటి బౌన్సర్లతో కలిసి 9 మంది యువకులను చితకబాదారు. బౌన్సర్ల దౌర్జన్యంపై గాయపడ్డ యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం