వరంగల్ లో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం...

Published : Aug 16, 2023, 08:12 AM ISTUpdated : Aug 16, 2023, 10:43 AM IST
వరంగల్ లో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం...

సారాంశం

వరంగల్ జిల్లా ఇల్లందు దగ్గర జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

వరంగల్ : వరంగల్ లో ఘోర రోడ్డుప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. వరంగల్ జిల్లా, వర్థన్నపేట మండలం ఇల్లందు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని డ్రైవర్ తో సహా నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆటోలోనే మరో ముగ్గురు ఇరుక్కుపోయారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరొకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. బాధితులంతా తేనె విక్రయించే కూలీలుగా తెలుస్తోంది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ రాజస్థాన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సమయంలో మద్యం మత్తులో లారీ నడిపినట్టుగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే