బైక్‌పై వెళుతున్న వ్యక్తిని .. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం: చూస్తూ పట్టించుకోని జనాలు

Siva Kodati |  
Published : Aug 15, 2020, 07:50 PM IST
బైక్‌పై వెళుతున్న వ్యక్తిని .. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం: చూస్తూ పట్టించుకోని జనాలు

సారాంశం

డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్‌‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు

డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్‌‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రామంతపూర్‌లో బస్సును పార్క్ చేసి బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్- నాగోల్ మార్గంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ తలుపుకు వేలాడుతున్న కొక్కెం వెంకటేశ్ వేసుకున్న రెయిన్ కోటుకు తగిలింది.

ద్విచక్ర వాహనం కింద పడిపోయింది. ఓ పక్క వెంకటేశ్‌ను డీసీఎం ఈడ్చుకెళ్తున్నా డ్రైవర్‌కు కనిపించలేదు. అతను కేకలు పెడుతున్నా డ్రైవర్‌కి వినిపించకపోగా.. తోటి వాహనదారులూ పట్టించుకోలేదు.

అలాగే నాగోల్ చౌరస్తా వరకు ఈడ్చుకెళ్లింది... ఆ ప్రాంతంలో రెయిన్ కోట్ తెగిపోవడంతో వెంకటేశ్ కిందపడిపోయాడు. అప్పటికే తలకు, పక్కటెముకలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలైన అతనిని స్థానికులు 108లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఒకేసారి ఎండలు, వానలు
Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu