జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

Arun Kumar P   | Asianet News
Published : Nov 09, 2020, 07:43 AM ISTUpdated : Nov 09, 2020, 07:53 AM IST
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

సారాంశం

రోడ్డుపక్కన ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. 

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.  మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. 

ప్రమాదానికి గురయినవారంతా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu