సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ.. ప్రగతి భవన్‌లో ఇరువురు నేతల చర్చలు..

By Sumanth KanukulaFirst Published Jan 11, 2022, 4:03 PM IST
Highlights


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (cm kcr) రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ (tejashwi yadav) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు చేరుకున్న తేజస్వీ యాదవ్.. ఆయనతో సమావేశమయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (cm kcr) రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ (tejashwi yadav) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు చేరుకున్న తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ బృందం.. ఆయనతో సమావేశమయ్యారు. తేజస్వి యాదవ్‌ బృందంలో సమాజ్ వాదీ పార్టీ నేతలు అబ్దుల్ బారీ సిద్దిఖీ, సునీల్ సింగ్, భోలా యాదవ్ ఉన్నారు. వీరిద్దరు జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీలు పోషించాల్సిన పాత్రపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. బిహార్ విపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్.. బీజేపీ వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు సీఎం కేసీఆర్ కూడా కొద్ది నెలలుగా బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పలు అంశాల్లో కేంద్రం తీరుపై మండిపడుతున్న కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా వ్యుహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ తమిళనాడు వెళ్లిన సందర్భంగా అక్కడ సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరు జాతీయ రాజకీయాలతో పాటుగా, ఫెడరల్ స్పూర్తిపై చర్చించినట్టుగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల కిందట వామపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలతో సీఎం కేసీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. 

ఇక, బీజేపీని గద్దె దింపితేనే సమస్యలు పరిష్కారమవుతాయని కేసీఆర్ కొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే.  తెలంగాణ హక్కులను పరిరక్షిస్తూనే.. అవసరమైతే దేశ ప్రయోజనాల కోసం కలిసి వచ్చే పార్టీలతో కలిసి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తామని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
 

click me!