హన్మకొండలో కారులో డెడ్‌బాడీ కలకలం: పోలీసుల దర్యాప్తు

By narsimha lode  |  First Published Jan 11, 2022, 3:52 PM IST

హన్మకొండలోని ఓ బార్ ఎదురుగా నిలిపి ఉన్న కారులో ఓ వ్యక్తి డెడ్ బాడీ కలకలం రేపుతుంది.ఇదే హత్యేనని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


హన్మకొండ: హన్మకొండ చౌరస్తా వద్ద నిలిపి ఉన్న carలో మృతదేహం కలకలం రేపింది. మృతుడు Suicide చేసుకొన్నాడా, లేక ఎవరైనా హత్య చేశారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతుడు hanmakondaలోని పెద్దమ్మగడ్డకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు 

రోడ్డుపైనే కారు ఉండడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో కారును పక్కకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించడగా కారులో డెడ్ బాడీనీ గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులోని మృతదేహం  పెద్దమ్మగడ్డకు చెందిన రమేష్ గా  పోలీసులు గుర్తించారు.

Latest Videos

మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రమేష్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.రమేష్ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాల ఆధారంగా కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు లేవని కుటుంబ సభ్యులు చెప్పారు. రమేష్ డె డ్ బాడీ ఉన్న కారు పార్క్ చేసిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించనున్నారు.

గతంలో కూడా కారులో మృతదేహల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసకొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది రెండు ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఏపీలో ఒక కేసు నమోదైంది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని కారులో మృతదేహం దగ్ధమైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో రియల్ ఏస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ ను హత్య చేసి కారులో మృతదేహన్ని దగ్ధం చేశారని  పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అల్వాల్ లో కారులో డెడ్ బాడీ కేసులో కూడా చోటు చేసుకొంది. రియల్ ఏస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డిని నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఈ ఘటన గత ఏడాది డిసెంబర్ 1న చోటు చేసుకొంది. 

తోట నరేందర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా కూడా పని చేస్తున్నాడు. ఓ ప్లాట్ సేల్ విషయం గురించి మాట్లాడాలని భాస్కర్ రెడ్డికి ఫోన్ చేశాడు. దాంతో భాస్కర్ రెడ్డి కారులో బయలుదేరి వెళ్లాడు. అక్కడ ప్లాట్ సేల్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తిది. దాంతో అసహనానికి లోనైన నరేందర్ రెడ్డి డ్రైవింగ్ సీట్లో ఉన్న భాస్కర్ రెడ్డిని గన్ తో కాల్చి చంపాడు. 

గత ఏడాది ఆగష్టు మాసంలో విజయవాడ మాచవరంలో పార్క్ చేసిన కారులో మృతదేహం కలకలం రేపింది.ఈ మృతదేహన్ని  తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌దిగా గుర్తించారు పోలీసులు. మృతుడు జి. కొండూరులోని జిక్సిన్ సిలిండర్స్ కంపెనీ యజమానిగా పోలీసులు తెలిపారు.వ్యాపారాల్లో విబేధాలతోనే రాహుల్ ను ప్రత్యర్ధులు హతమార్చారని పోలీసులు తేల్చి చెప్పారు. రాహుల్ కన్పించకుండాపోయాడని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  డ్రైవింగ్ సీటులోనే ఆయన చనిపోయి ఉన్నాడు.తొలుత రాహుల్ ఆత్మహత్య చేసుకొన్నాడని భావించినా  ఆ తర్వాత కారులో దొరికిన ఆధారాల ఆధారంగా రాహుల్ ను హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. 


 


 

click me!