రహస్య ఆస్తులను కాపాడుకునేందు కేటీఆర్‌ ఢిల్లీ టూర్.. రాష్ట్ర బీజేపీ నేతలు ఆలోచించుకోవాలి: రేవంత్

Published : Jun 25, 2023, 01:33 PM IST
రహస్య ఆస్తులను కాపాడుకునేందు కేటీఆర్‌ ఢిల్లీ టూర్.. రాష్ట్ర బీజేపీ నేతలు ఆలోచించుకోవాలి: రేవంత్

సారాంశం

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఢిల్లీకి రాష్ట్ర సమస్యల కోసం, అభివృద్ది  కోసం వెళ్లలేదని విమర్శించారు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఢిల్లీకి రాష్ట్ర సమస్యల కోసం, అభివృద్ది  కోసం వెళ్లలేదని విమర్శించారు. ఐటీ దాడుల నుంచి బయట పడేందుకు మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్ అని ఆరోపించారు. కేటీఆర్ సొంత కంపెనీ మీద గత వారం ఐటీ దాడులు జరిగాయని.. అందులో చాలా రహస్యమైన ఆస్తుల వివరాలు దొరికాయని ఆరోపణలు చేశారు. సొంత ఆస్తుల గుట్టు బయటకు రాకుండా మెనేజ్ చేసుకునే పనిలో కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. 

ఆ వివరాలను విడుపించుకోవడానికి ప్రధాని మోదీకి కేసీఆర్ లొంగిపోయారని రేవంత్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల రూపాయలు ఎలా వచ్చాయనేది  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వంద కోట్ల రూపాయలు  తీసుకున్నారనే ఆరోపణలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంత్రులను అరెస్ట్ చేశారని.. కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చారని అన్నారు. రూ. 100 కోట్ల దోపిడికి పాల్పడితేనే ఇంత చేశారని.. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌పై, ఆయన మంత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని  ప్రశ్నించారు. 

బీఆర్ఎస్, బీజేపీలది ఫెవికల్ బంధం అని  విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని కోరారు. భ్రమల్లో ఉండొద్దని  సూచించారు. ఢిల్లీ  పెద్దలతో ఏమీకాదని.. కేసీఆర్, బీజేపీ ఒకటేనని విమర్శించారు. ఢిల్లీ వదిలేసి గల్లీలోకి వచ్చి కొట్లాడాలని కోరారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?