కేటీఆర్ ను అలా పిలిచినందుకే తుమ్మలకు మంత్రి పదవి దక్కలేదా?

By telugu teamFirst Published Feb 19, 2019, 8:15 AM IST
Highlights

తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రి వర్గ సభ్యుల కూర్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఎందుకు మంత్రి పదవి రాదో ఆయన వివరించారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రి వర్గ సభ్యుల కూర్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఎందుకు మంత్రి పదవి రాదో ఆయన వివరించారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

తుమ్మల నాగేశ్వర రావుకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కూడా రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను రాము అని పిలిచినందుకే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు కేబినెట్లో చోటు దక్కలేదని ఆయన అన్నారు. 

హరీష్ రావుకు కూడా ఎందుకు మంత్రి పదవి రాదో రేవంత్ రెడ్డి చెప్పారు. ఎదురు తిరిగితే హరీష్ రావును పాస్టుపోర్టుల కేసులో ఇరికించేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారని ఆయన అన్నారు. కడియం శ్రీహరిని, నాయిని నర్సింహా రెడ్డిని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని అన్నారు. 

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి దగ్గర రూ.50 లక్షలు దొరికినా ఆ కేసును ఈడీకి ఇవ్వలేదని, తనపై మాత్రం ఐటీ, ఈడీ కేసులు పెట్టించారని, తనపైనా, వేం నరేందర్‌ రెడ్డిపైనా ఎన్ని కేసులైనా పెట్టుకోండి గానీ వేం నరేందర్‌ రెడ్డి కొడుకులను పిలిచి విచారించడమేమిటని అడిగారు. 

click me!