రెండుసార్లు గెలిచి కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి: ఆ సవాల్‌‌ను ఏం చేస్తారు

By narsimha lodeFirst Published Dec 11, 2018, 2:34 PM IST
Highlights

ఉమ్మడి మహబూబ్‌నగర్  జిల్లాలోని  కొడంగల్ ‌అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
 


కొడంగల్: ఉమ్మడి మహబూబ్‌నగర్  జిల్లాలోని  కొడంగల్ ‌అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి 2009 ఎన్నికల్లో  రేవంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి  రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.

గత ఏడాదిలో  టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడిన సమయంలోనే  ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికలు వస్తాయని భావించారు. ఆ సమయంలో  టీఆర్ఎస్ వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఆ సమయం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ లో పనిచేస్తున్నారు.

రేవంత్ రెడ్డిని ఓడించేందుకు  టీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేసింది. రేవంత్ రెడ్డిని  ఓడించేందుకు టీఆర్ఎస్ చేసిన వ్యూహం ఫలించింది.హరీష్ రావు నేతృత్వంలో  టీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

కొడంగల్ అసెంబ్లీ నుండి తాను ఓటమి పాలైతే  రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై కేటీఆర్‌కు సవాల్ విసిరారు.  కొడంగల్ నుండి రేవంత్ రెడ్డిని ఓడిస్తామని కేటీఆర్  పోలింగ్ కు రెండు రోజుల ముందు ప్రకటించారు. ఈ సవాల్ కు రేవంత్ స్పందించిన విషయం తెలిసిందే.

click me!