కేసిఆర్ పది కోట్ల మాట నాయిని నోట: రేవంత్ రెడ్డి ఫిర్యాదు

By pratap reddyFirst Published Oct 13, 2018, 2:21 PM IST
Highlights

రూ.10 కోట్లు ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేత నాయినినర్సింహారెడ్డిపై సీఈవో రజత్‌కుమార్‌కు  రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నాయిని ప్రకటన ఆధారంగా కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

హైదరాబాద్: ఆపద్ధర్మ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ (ఈసి)ని కోరినట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పినట్టుగా నాయిని అన్నారని ఆయన గుర్తు చేశారు. 

ఆ రూ.10 కోట్లు ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేత నాయినినర్సింహారెడ్డిపై సీఈవో రజత్‌కుమార్‌కు  రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నాయిని ప్రకటన ఆధారంగా కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

తన సెక్యూరిటీపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డీజీపీ మహేందర్‌రెడ్డిపై నమ్మకం లేదని, గతంలో టీఆర్‌ఎస్‌ శిక్షణాతరగతులకు మహేందర్‌రెడ్డి వెళ్లారని అన్నారు. 

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ తనను బెదిరించారని, భౌతికంగా లేకుండా చేస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరించారని రేవంత్ రెడ్డి అన్నారు. తనకు కేంద్ర సెక్యూరిటీ సంస్థల నుంచి రక్షణ కల్పించాలని రేవంత్‌రెడ్డి కోరారు.

click me!