ఓటమిని అంగీకరిస్తున్నా.. రేవంత్ రెడ్డి

Published : Dec 11, 2018, 01:23 PM IST
ఓటమిని అంగీకరిస్తున్నా.. రేవంత్ రెడ్డి

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా...ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో దూసుకుపోతోంది. కాగా.. కొడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా వెనుకంజలో పడిపోయారు.

తాజాగా.. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో కూర్చుని చర్చిస్తామని రేవంత్‌ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా? టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందా? అనే విషయాలు సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ఉండి పోరాడతామన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలు లేనెత్తడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తామన్నారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం