కేసీఆర్ మాయలో పడి.. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దు.. రేవంత్ రెడ్డి

Published : Aug 04, 2021, 05:09 PM IST
కేసీఆర్ మాయలో పడి.. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దు.. రేవంత్ రెడ్డి

సారాంశం

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. రాహుల్ గాంధీతో దళిత దండోరాపై చర్చించామన్నారు. దళిత దండోరా కార్యక్రమానికి రాహుల్ గాంధీ రాబోతున్నారని తెలిపారు.

హైదరాబాద్ : పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా మార్చుకుని కేసీఆర్ రాజకీయలబ్ది పొందిన విషయాలు చూశామని, మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దన్నారు. 

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. రాహుల్ గాంధీతో దళిత దండోరాపై చర్చించామన్నారు. దళిత దండోరా కార్యక్రమానికి రాహుల్ గాంధీ రాబోతున్నారని తెలిపారు.

సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాంతం, తేదీ ఎక్కడ, ఎప్పుడు అనేది మనం నిర్ణయించాలని సూచించారు. హుజూరాబాద్ అభ్యర్థిని పొన్నం ప్రభాకర్, దామోదర రాజా నర్సింహలు కలిసి సిఫారసు చేస్తారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?