రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

Published : Dec 04, 2018, 07:31 AM ISTUpdated : Dec 04, 2018, 02:41 PM IST
రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సారాంశం

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కొడంగల్‌లోని ఆయన నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగలగొట్టి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 

రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్, గన్‌మెన్లను కూడా అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్ పర్యటనను అడ్డుకునేందుకు రేవంత్ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో సీఎం కోస్గిలో నిర్వహించనున్న బహిరంగసభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్య చేపట్టారు.

రేవంత్‌రెడ్డిని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకోవడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 
 
"

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?