సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు మధుసూదన్ గా గుర్తించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.డీజీల్ ట్యాంక్ కు నిప్పు పెట్టే ప్రయత్నం చేసిన సమయంలో కాల్పులు జరిపినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారని రిమాండ్ రిపోర్టు తెలిపిందని మీడియా కథనాలు ప్రసారం చేసింది.
హైదరాబాద్: Secunderabad, రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు Madhusudan గా గుర్తించినట్టుగా Remand Report లో పోలీసులు తెలిపారు.ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ Railway Station లో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. Agnipath ను నిరసిస్తూ ఆందోళనకారులు పథకం ప్రకారంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు Firing దిగారు. పోలీసుల కాాల్పుల్లో దామెర రాకేష్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్టును పలు మీడియా సంస్థలు ప్రసాారం చేశాయి. మీడియా సంస్థలు ఎబీఎన్, ఎన్టీవీ న్యూస్ చానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి.
undefined
also read:Agnipath Protest In Secunderabad: వాట్సాప్ గ్రూప్ ఆడ్మిన్లను విచారిస్తున్న పోలీసులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఉదయం 8:50 గంటలకు ఆందోళనకారులు తొలుత చేరుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తొలుత 500 మంది రైల్వే స్టేషన్ లోకి వచ్చారని ఆ రిమాండ్ రిపోర్టు తెలిపిందని ఈ కథనాలు తెలిపాయి. Diesel Tank ను ధ్వంసం చేసేందుకు ఆందోళనకారుల ప్రయత్నించారన్నారు. అంతేకాదు దీనికి నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకొనే క్రమంలోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారని మీడియా చానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి.
స్టేషన్ కు వచ్చే వారంతా పెట్రోల్ టైర్లతో రావాలని కూడా Whats APP గ్రూపుల్లో ప్రచారం చేశారని కూడా రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ బ్లాక్ అనే వాట్సాప్ గ్రూప అడ్మిన్ గా Ramesh ను గుర్తించామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. Defence కోచింగ్ సెంటర్లు ఆర్మీ అభ్యర్ధులను రెచ్చగొట్టాయని కూడా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నట్టుగా మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే 56 మందిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.మరో 11 మంది పరారీలో ఉన్నారని కూడా రిమాండ్ రిపోర్టు తెలిపిందని మీడియా ప్రసారం చేసింది.రైల్వే స్టేషన్ లో విధ్వంసం చేసి లైవ్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో నిందితులు పోస్టు చేశారని కూడా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో 11 మందిని సాక్షులుగా చేర్చినట్టుగా రిమాండ్ రిపోర్టు తెలిపిందని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్, ఛలో సికింద్రాబాద్ ఏఆర్ఓ 3, ఆర్మీ జీడీ 2021 మార్చ్ ర్యాల, సీఈఈ సోల్జర్ గ్రూపులు క్రియేట్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక్క వాట్సాప్ గ్రూప్ ఆడ్మిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఏడు గ్రూప్ ఆడ్మిన్లు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరో వైపు తమ పిల్లలకు ఏం తెలియదని జైల్లో ఉన్న పిల్లలను పరామర్శించేందుకు వచ్చిన పేరేంట్స్ చెబుతున్నారు.