పసిడితో పోటీకి మిర్చి ధర: వరంగల్‌ మార్కెట్‌లో క్వింటాల్ మిర్చికి రూ. 52 వేలు

By narsimha lode  |  First Published Mar 30, 2022, 10:30 AM IST

వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి రికార్డు ధర దక్కింది. క్వింటాల్ మిర్చికి రూ. 52 వేలు పలికింది. ఈ నెల మొదటి వారం నుండి మిర్చి ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది దిగుబడి తగ్గిన కారణంగా మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉందని  రైతులు చెబుతున్నారు.


హైదరాబాద్: warangal ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం నాడు దేశీయ Red chilliకి రికార్డు ధర దక్కింది. క్వింటాల్ మిర్చికి రూ. 52 వేలు దక్కింది.ఈ దఫా మిర్చి దిగుబడి తక్కువగా రావడంతో మిర్చి పండించిన రైతులకు డిమాండ్ పెరిగింది. ఈ నెల మొదటి వారం నుండి మిర్చి ధర పెరుగుతూ వస్తుంది. ఈ నెల 3వ తేదీన దేశీయ Mirchi ధర క్వింటాల్ కు రూ. 32 వేలు ధర పలికింది. ఆ తర్వాత రెండు రోజులకే  మిర్చి ధర ఏకంగా రెండు వేలు పెరిగింది.  క్వింటాల్ మిర్చి ధర  రూ. 35 వేలకు పెరిగింది. ఆ తర్వాత క్వింటాల్ మిర్చి రూ. 40 వేలు పలికింది. 

Asia లోనే అతిపెద్ద Market యార్డుల్లో ఒకటైన వరంగల్‌ Enumamula వ్యవసాయ మార్కెట్‌ కు భారీ ధర పలికింది. చపాటా, సింగిల్‌పట్టీ, తేజ, వండర్‌హాట్‌, దీపిక, 1048 రకం, 341 రకం మిర్చి వరంగల్ మార్కెట్ కు వస్తుంది.సింగిల్‌పట్టీ, చపాటా రకాలను పచ్చళ్ల తయారీకి ముఖ్యంగా మామిడికాయ పచ్చడి తయారీకి ఉపయోగిస్తారు. ఈ మిర్చి పౌడర్‌ స్వచ్ఛమైన ఎరుపుదనం, కారం, రుచి కలిగి ఉంటుంది. ఈసారి వైరస్‌, అకాల వర్షాల వల్ల 90 శాతం మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. . ఫలితంగా దిగుబడి బాగా తగ్గింది. దీంతో వచ్చిన అరకొర మిర్చికి మంచి ధర దక్కుతోంది. . 

Latest Videos

దేశంతో పాటు విదేశాల్లో కూడా మిర్చికి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా దేశీయ మిర్చిని పండిస్తారు.  అకాల వర్షాలు, వైరస్ కారణంగా ఈ ఏడాది మిర్చి పంటు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి బాగా తగ్గింది. దీంతో రూ. 37 వేల నుండి మిర్చి ధర రూ. 52 వేలకు పెరిగింది. మిర్చికి ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం కూడా ఇదే తొలిసారి అని రైతులు చెబుతున్నారు. 

మరో వైపు మిర్చితో పాటు పత్తికి కూడా వరంగల్ మార్కెట్ లో రికార్డు స్థాయి ధర దక్కింది. క్వింటాలు పత్తికి రూ.10,720 పలుకుతుంది. సగటున రూ.9,325గా నమోదైంది. జమ్మికుంట మార్కెట్‌కు 12 ట్రాలీలు పత్తి విక్రయానికి రాగా, గరిష్టంగా రూ.10,810 ధర పలికింది. వరంగల్‌లో రూ.10,720, ఖమ్మంలో రూ.10,600 పలికింది.
 

click me!