నల్గొండలో రియల్టర్ దారుణహత్య: మృతదేహం పక్కన కారంపొడి

Siva Kodati |  
Published : Jul 02, 2019, 01:16 PM IST
నల్గొండలో రియల్టర్ దారుణహత్య: మృతదేహం పక్కన కారంపొడి

సారాంశం

నల్గొండలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు.  స్థానిక గంధవారిగూడెం రోడ్డులో నివాసం ఉంటున్న సోమకేశవులను మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

నల్గొండలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు.  స్థానిక గంధవారిగూడెం రోడ్డులో నివాసం ఉంటున్న సోమకేశవులను మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

అతని భార్య గది గడియపెట్టి ఇంటి వరండాలో కేశవులను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అతనిని దుండగులు ఎలా హత్య చేశారన్నది తెలియరాలేదు. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు... కానీ కేశవులు ముక్కు నుంచి రక్తం కారిన గుర్తులున్నాయి.

దుండగులు హత్యానంతరం ఇంటి ఆవరణలో కారంపొడి చల్లి పరారయ్యారు. స్థానికులు వెళ్లి చూసేసరికి ఇంట్లో కారంపొడి చల్లి, పక్కన మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేశవులకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుని భార్య, స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే