కుంతియా స్థానంలో కొత్త ఇంచార్జీ: టీపీసిసీ రేసులో రేవంత్, శ్రీధర్ బాబు

Published : Nov 25, 2019, 05:59 PM IST
కుంతియా స్థానంలో కొత్త ఇంచార్జీ: టీపీసిసీ రేసులో రేవంత్, శ్రీధర్ బాబు

సారాంశం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీగా కుంతియా స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం కన్పిస్తోంది.


తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఈ క్రమంలో పక్కా ప్రణాళికలను రచిస్తోన్న అధిష్టానం.. పార్టీలో పలు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఆర్సీ కుంతియా స్థానంలో ఓ యువ నేతను తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక ఈ పదవి రేస్‌లో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో రాజీవ్ శంకర్ రావు సతవ్(మాజీ ఎంపీ, గుజరాత్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్), గౌరవ్ గగోలి(అస్సాం ఎంపీ), ఆర్‌పీఎన్ సింగ్(జార్ఖండ్ ఇన్‌ఛార్జ్)లు ఉన్నారు. ఇక ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, సీనియర్ నేతలతో చర్చించనున్న అధిష్టానం.. ఈ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవిపై ఇంకా సంగ్ధిగ్ధత కొనసాగుతోంది. ఈ పదవి కోసం పార్టీ సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్‌తో పాటు రేవంత్ రెడ్డి తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి గానీ, శ్రీధర్ బాబుకు గానీ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉత్తర భారతంలోని రాష్ట్రాలకు పంపనున్నట్లు కూడా సమాచారం


 

PREV
click me!

Recommended Stories

ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణకు కేటీఆర్‌ హాజరు | Phone Tapping Case Issue | Asianet News Telugu
SITవిచారణకు హాజరైనకేటీఆర్| BRS Workers Protest at Jubilee Hills Police Station | Asianet News Telugu