RTC STrike:మరోసారి వెనక్కు తగ్గిన జేఎసీ, సమ్మె విరమణ

By narsimha lodeFirst Published Nov 25, 2019, 5:22 PM IST
Highlights

సమ్మెను విరమిస్తున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మంగళవారం నాడు  ఉదయం ఆరు గంటల నుండి విధులకు హాజరుకావాలని ఆశ్వత్థామరెడ్డి కార్మికులను కోరారు. 

మ్మె విరమిస్తున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. భేషరతుగా తమను విధుల్లోకి తీసుకొంటారని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. రేపు విధుల్లోకి తీసుకోకపోతే సమ్మెను పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

సోమవారం నాడు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల శ్రేయస్సు కోసమే విధులకు హాజరుకావాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

తాము ఓడిపోలేదు,  ప్రభుత్వం గెలవలేదని ఆర్టీసీ జేఎసీ కన్వీసర్ ఆశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు.. ఈ నెల 26వ తేదీ నుండి సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా జేఎసీ ప్రకటించింది. ప్రజల సౌకర్యార్ధం సమ్మెను విరమించినట్టుగా జేఎసీ నేతలు చెప్పారు.

52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం ఆరు గంటలకు ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ కార్మికులు కూడ ఆయా డిపోల వద్దకు వెళ్లి డ్యూటీల్లో చేరాలని  ఆశ్వత్థామరెడ్డి కోరారు.

సోమవారం నాడు ఉదయం  నుండి సాయంత్రం వరకు ఆర్టీసీ జేఎసీ నేతలు నాలుగు దఫాలు చర్చించి చివరకు  సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకొన్నారు.  హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తాము నడుచుకొంటున్నట్టుగా జేఎసీ నేతలు తేల్చి చెప్పారు.

Also read:సార్ లేరు, కాస్త టైమివ్వండి: ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల కేసులో హైకోర్టుకు ప్రభుత్వం వినతి...

సమ్మెను రెండు వారాల్లో పరిష్కరించాలని  లేబర్ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత ఆర్టీసీ జేఎసీ భేషరతుగా తమను విధుల్లోకి తీసుకోవాలని జేఎసీ ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాలేదు.

అయితే మంగళవారం నాడు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు రాకూడదని ఆశ్వత్థామరెడ్డి కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో  తమను విధుల్లోకి తీసుకోవాలని  ఆశ్వత్థామరెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని కోరారు.ప్రజా రవాణను కాపాడుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు చెప్పారు.

52 రోజులుగా కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. సెప్టెంబర్ మాసం నుండి సమ్మెలో ఉన్న కార్మికులకు వేతనాలు లేవు. ఈ పరిస్థితుల నేపథ్యంలో  కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.మరికొందరు గుండెపోటుతో మృతి చెందారు. 

రెండు దఫాలు సమ్మె విరమించాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ జేఎసీని కోరారు. కానీ, ఆర్టీసీ జేఎసీ నేతలు మాత్రం సానుకూలంగా స్పందించలేదు. అయితే భేషరతుగా తమను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఎసీ ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరినా కూడ స్పందించలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించారు.
 

click me!