సోదరిపై అత్యాచారం: దోషికి 13 ఏళ్ల జైలు శిక్ష

By pratap reddyFirst Published Sep 13, 2018, 8:05 AM IST
Highlights

 ఓ ప్రబుద్ధుడు సోదరిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. అందుకు గాను అతనికి హైదరాబాదులోని నాంపల్లి కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.2500 జరిమానా విధించింది. 

హైదరాబాద్‌: ఓ ప్రబుద్ధుడు సోదరిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. అందుకు గాను అతనికి హైదరాబాదులోని నాంపల్లి కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.2500 జరిమానా విధించింది. జరిమానా చెల్లించలేకపోతే మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.

హైదరాబాదు పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి సొంత చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. షాహినాయత్ గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఒకటవ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి దాన్ని అత్యంత హేయమైన చర్యగా భావించారు.  

మైనర్‌పై లైంగిక దాడిలో నిందితుడిగా ఉండటంతో పోక్సో చట్టం కింద ఐదేళ్ల జైలుశిక్ష, రూ. వెయ్యి జరిమానా, 354 సెక్షన్‌ ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష, రూ. వెయ్యి జరిమానా, సెక్షన్‌ 354-ఎ(1) ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధించారు.

అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేస్తూ జరిమానాలు విధించారు. జరిమానాలు చెల్లించకుంటే అదనంగా మరో 3 నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.

click me!