నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

Published : Sep 19, 2021, 12:10 PM IST
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

సారాంశం

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూజెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మరణించగా, కంటైనర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో మరో ముగ్గురు మరణించారు.

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

కంటైనర్ ను కారు ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

మరో ఘటనలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో మరో ముగ్గురు మరణించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. 

PREV
click me!

Recommended Stories

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో