కరీంనగర్‌లో దారుణం: వెంటాడి ఇద్దరి గొంతు కోశాడు

Published : Jul 20, 2021, 09:44 AM IST
కరీంనగర్‌లో దారుణం: వెంటాడి ఇద్దరి గొంతు కోశాడు

సారాంశం

కుటుంబ కలహల కారణంగా  కరీంనగర్ జిల్లాలో  రమేష్ అనే వ్యక్తి జంట హత్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆయన  పోలీసులకు లొంగిపోయాడు.  ఆటోలో వెళ్తున్న భార్య,మామలను రమేష్ వెంటాడి హత్య చేశాడు.

కరీంనగర్: కుటుంబ కలహాల కారణంగా భార్యతో పాటు మామను  అత్యంత దారుణంగా హత్య చేశాడు రమేష్ అనే వ్యక్తి. హత్య చేసిన తర్వాత తన సోదరుడితో కలిసి ఆయన పోలీసులకు లొంగిపోయాడు.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గుట్టలో ఈ హత్యలు చోటు చేసుకొన్నాయి.  ఇదే జిల్లాలోని వెల్ది గ్రామానికి చెందిన లావణ్యకు అన్నారం గ్రామానికి చెందిన రమేష్ తో  వివాహం జరిగింది. వీరికి  కొడుకు, కూతురున్నారు. 

భార్యాభర్తల మధ్య విబేధాల కారణంగా రెండు మాసాలుగా  లావణ్య పుట్టింట్లో ఉంటుంది. అంతేకాదు భర్తపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. దంపతులకు నచ్చజెప్పారు. కానీ రమేష్ మాత్రం తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంపై మనస్థాపానికి గురయ్యారు.

సోమవారం నాడు రాత్రి లావణ్య ఆమె తండ్రి  ఓదెలు కొడుకు అజిత్, కుమార్తె అక్షితలు ఆటోలో వెల్దికి వెళ్లుండగా రమేష్ అతని సోదరుడు  అనిల్ బైక్ పై ఈ ఆటోను వెంబడించాడు. శ్రీనివాసనగర్ గుట్ట వద్ద ఆటోను ఆపి లావణ్యను ఆమె తండ్రి ఓదెలును  కత్తితో గొంతుకోసి చంపారు. అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి