గుత్తా జ్వాలా ఓటు గల్లంతుపై రజత్ కుమార్ స్పందన ఇదీ...

Published : Dec 08, 2018, 07:37 AM IST
గుత్తా జ్వాలా ఓటు గల్లంతుపై రజత్ కుమార్ స్పందన ఇదీ...

సారాంశం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు గల్లంతుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. తోన ఓటు గల్లంతుపై గుత్తా జ్వాల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు గల్లంతుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. తోన ఓటు గల్లంతుపై గుత్తా జ్వాల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

గుత్తా జ్వాల పేరు 2015లోనే జాబితా నుంచి గల్లంతయిందని రజత్ కుమార్ చెప్పారు. గల్లంతైన ఓట్లపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు. 2019లో కొత్త జాబితా తయారు చేస్తామని రజత్‌కుమార్ అన్నారు
 
తన కుటుంబ సభ్యుల గల్లంతు కావడంపై గుత్తా జ్వాల నిరాశకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లతో నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదో, ఏ కారణంతో తన పేరును తొలగించారో చెప్పాలని అడిగారు. 

తన ఓటుతో పాటు తన తండ్రి, సోదరి ఓటు కూడా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వారాల క్రితం తాము ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్నామని, అప్పుడు ఉన్నట్లు తెలిసిందని, ఇప్పుడెలా ఓట్లు మిస్సయ్యాయో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?