అలా చేయకపోతే.. ఇప్పుడున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెనక్కి తీసుకోండి: ఇంటెలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ

By Sumanth Kanukula  |  First Published Nov 17, 2022, 12:31 PM IST

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అందించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనితీరుపై కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు.


గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అందించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనితీరుపై కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూన్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోవడంతో రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరుచూ మరమ్మతులకు గురవుతుందని.. దానిని మార్చాలని కోరారు.

తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరుచూ మరమ్ముత్తులకు గురువుతుందని.. చెప్పినా రిపేర్ చేసి తిరిగి  మళ్లీ అదే వాహనాన్ని కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆ వాహనం పలు మార్గమధ్యంలోనే నిలిచిపోతుండటంతో.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని తెలిపారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారని.. అందులో తన పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్న విషయం పోలీసులకు తెలుసని.. అయినా తన భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారని చెప్పారు. 

Latest Videos

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ సెటైరికల్ కామెంట్స్ కూడా చేశారు. తన భద్రతకు ముప్పు ఉందని.. కొత్త వాహనం ఇవ్వడానికి కేటీఆర్ అనుమతి లేదా అని ప్రశ్నించారు. లేకపోతే అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే.. నాకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోవాలని.. పాత వాహనాన్ని తాను వినియోగించలేనని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై ఆగిపోయింది. దానిపై స్పందించిన రాజాసింగ్..  ‘‘నా బుల్లెట్ ప్రూఫ్ కారు అకస్మాత్తుగా ఆగిపోవడం ఇది నాలుగోసారి. ప్రతిసారీ అధికారులకు ఫిర్యాదు చేస్తే మరమ్మతులు చేసి వెనక్కి పంపుతున్నారు. మాలాంటి శాసనసభ్యులకు అలాంటి వాహనాలు లభిస్తుండగా.. టీఆర్‌ఎస్ నాయకులు సరికొత్త, అధునాతన మోడల్‌లను కేటాయిస్తున్నారు’’ అని అన్నారు. 

click me!