తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Published : Jan 26, 2019, 04:36 PM IST
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

సారాంశం

రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 

రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 1.5కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని సంబంధిత అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ , ఏపీ రాష్ట్రాల్లో రెండు రోజుల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.

తెలంగాణలో శనివారం, ఆదివారం ఉరుములతో కూడిన వర్షంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం పలు ప్రాంతాల్లో  వడగండ్ల వాన పడే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కూడా ఇదే రకమైన వాతావరణం కొనగాతుందని వెల్లడించింది.

కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వడగండ్ల వర్షంతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమ వారాల్లో కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇందుకు క‌దా జ‌నాలకు హైద‌రాబాద్ అంటే పిచ్చి.. వైర‌ల్ అవుతోన్న ఉద్యోగి వీడియో
Hyderabad : వస్తావా..? నీ రేట్ ఎంత..? : అర్థరాత్రి ఓ మహిళా ఐపిఎస్ కు ఎదురైన అనుభవం