ఇక్కడ కూడా తెలంగాణకు అన్యాయంచేశారు.. కోదండరాం

By ramya neerukondaFirst Published Jan 26, 2019, 1:43 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న అవార్డులో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీజేఎస్ అధినేత కోదండరాం అభిప్రాయపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న అవార్డులో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీజేఎస్ అధినేత కోదండరాం అభిప్రాయపడ్డారు. శనివారం నగరంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అంటే రాజకీయ విప్లవం రావటమే అని అన్నారు. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేయాలి సూచించారు. భవిష్యత్తు నిర్మాణానికి రాజ్యాంగం ఓ బ్లూ ప్రింట్ అని కోదండరాం పేర్కొన్నారు. రాజ్యాంగ చట్రంలో నిలబడి పాలన సాగించాలని ఆయన తెలిపారు. 

రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదన్నారు. ఎవరైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ సలహాలు అవసరం లేదని.. ఏం చేయాలో తమకు తెలుసన్నారు. అడిగే హక్కు తమకుందని... సమాధానం చెప్పాల్సిన బాధ్యత రజత్ కుమార్ మీద ఉందని కోదండరాం అన్నారు.

click me!