తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదు : మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం

By Siva KodatiFirst Published Dec 23, 2022, 3:25 PM IST
Highlights

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు.  బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో ప్రకటన చేసింది. రైల్వేల భవిష్యత్తు అవసరాలకు కూడా సరిపోయేలా కోచ్‌ల తయారీ సామర్ధ్యం వుందని తెలిపింది. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

Also REad: రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్‌ ధర్నాలు.. కేంద్రం తీరుకు నిరసనగా నేతల పిలుపు..

ఇకపోతే... కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి నిన్న కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో తెలంగాణ బీజేపీ నేతలు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ఇతర ప్రాంతాలకు కేంద్రం కోచ్ ఫ్యాక్టరీలను కేటాయిస్తుంటే.. మరెందుకు మన రాష్ట్రానికి ఆ నేతలు కోచ్ ఫ్యాక్టరీని తీసుకురాలేకపోతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. అస్సాంలోని కోక్రాజార్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్రం తెలిపిన నేపథ్యంలో కేటీఆర్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. 
 

click me!