తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు.. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు..

By Sumanth KanukulaFirst Published Sep 24, 2022, 1:46 PM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్స్‌లో తనిఖీలు చేపడుతున్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్స్‌లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఐదు ల్యాబ్‌లు, ఒక ప్రైవేట్ ఆస్పత్రిని సీజ్ చేశారు. నల్లగొండ జిల్లాల్లో 6 ప్రైవేట్ ఆస్పత్రులకు, ఆదిలాబాద్ జిల్లాలో  3 ప్రైవేట్ ఆస్పత్రులకు, జగిత్యాల జిల్లాలో 2 ప్రైవేట్ ఆస్పత్రులకు, ములుగు జిల్లాలో 3 ప్రైవేట్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఇక, ప్రైవేట్ ఆస్పత్రులపై మరో వారం రోజుల పాటు ఉన్నతాధికారులు దాడులు కొనసాగే అవకాశం ఉంది.  

ఇక, నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు.. అనుమతులు లేని ఆస్పత్రులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. 

click me!