మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీ.. ప్రతి గ్రామంలో పాదయాత్రకు ప్లాన్..!

By Sumanth KanukulaFirst Published Sep 24, 2022, 1:26 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నిక విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే మునుగోడు ఉపఎన్నిక కోసం 16 మంది నేతలతో బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్టీరింగ్ కమిటీ నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. 

మునుగోడు ఉపఎన్నిక విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే మునుగోడు ఉపఎన్నిక కోసం 16 మంది నేతలతో బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్టీరింగ్ కమిటీ నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యుహంపై నేతలు చర్చిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల వారీగా చేసిన సర్వే నివేదికను పరిశీలిస్తున్నారు. గ్రామాల వారీగా  కమిటీలు, మండలాల వారిన ఇంచార్జ్‌ నియామకంపై ప్రధానంగా స్టీరింగ్ కమిటీ నేతలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే చేరికల అంశంపై నేతలు దృష్టి సారించారు. 

అయితే మునుగోడులో ప్రతి ఓటర్‌ను కలిసేలా ప్రచారం చేపట్టాలని బీజేపీ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టాలని  ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. 

ఇదిలా ఉంటే.. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిటీకి చైర్మన్‌గా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ కో ఆర్డినేటర్‌గా నియమించింది. 

ఈ స్టీరింగ్ కమిటీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్,  మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి  మోహన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రరీ దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ,  మాజీ ఎమ్మెల్యే యెన్నం  శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ రాపోల్ ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టీ  ఆచారి, దాసోజు శ్రవణ్‌లు ఉన్నారు. 

click me!