
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో Paddy ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు Rahul Gandhi స్పందించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలోని Farmers తరపున పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే తెలుగులో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో BJP,TRS ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతలు శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
వరి ధాన్యం కొనుగోలు చేయాలని Congres పార్టీ రాష్ట్రంలో ఉద్యమానికి సిద్దమైంది. నెల రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి నిర్వహించిన ఆందోళనలకు ముగింపుగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
సోమవారం నాడు తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుధీర్ఘంగా సమావేశమైంది. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. సీనియర్ నేతలు ఆయా జిల్లాల్లో పర్యటించనున్నారు.
అంతేకాదు వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది.
వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు.
మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఆందోళనలు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. సీనియర్ నేతలు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కూడా పీసీసీ నిర్ణయం తీసుకొంది. వరి ధాన్యం కొనుగోలు విషయమై నెల రోజుల పాటు ఆందోళనలకు పీసీసీ ప్లాన్ చేసింది.
ఏప్రిల్ చివర్లో రైతు ఉద్యమాల ముగింపును పురస్కరించుకొని వరంగల్ వేదికగా సభను నిర్వహించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఏప్రిల్ 7న విద్యుత్ సౌధ వద్ద ఆందోళన నిర్వహించనున్నారు. మరో వైపు 111 జీవోపై మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ఎఐసీసీ ఇచ్చిన పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర నేతలు పాల్గొనాలని నిర్ణయం తీసుకొన్నారు.