రాహుల్ తెలంగాణ పర్యటన: గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి

By Arun Kumar PFirst Published Aug 14, 2018, 5:12 PM IST
Highlights

రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు విచ్చేసిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఉదయం నుండి రాహుల్ తీరిక లేకుండా పార్టీ ఏర్పాటుచేసిన వివిధ  కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాస్సేపటి క్రితమే రాహుల్ హరిత ప్లాజా నుండి నేరుగా గన్ పార్కు వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. 
 
రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా గన్ పార్క్ వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో వారిని అదుపుచేయడం అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి కష్టంగా మారింది. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. రాహుల్ రాకకు ముందు కాస్సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ట్రాపిక్ జామ్ కారణంగా గన్ పార్క్ కి చేరుకోడానికి రాహుల్ కి ఆలస్యమైంది. 3 గంటలకే ఆయన గన్ పార్క్ కి చేరుకోవాల్సి ఉండగా దాదాపు గంటన్నర లేటుగా అక్కడికి చేరుకున్నారు. దీంతో సరూర్ నగర్ లో తలపెట్టిన బహిరంగ సభకు కూడా రాహుల్ కాస్త ఆలస్యంగా వెళ్లనున్నారు. ఇప్పటికే సరూర్ నగర్ స్టేడియంకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో అమరువీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు కుంతియా, టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సర్వే సత్యనారాయణ తదితర సీనియర్ నాయకులు కూడా గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు  అర్పించారు.  
 
click me!