వరంగల్‌లో దారుణం:తల్లిని కొట్టి చంపిన కొడుకు

Published : Dec 14, 2022, 02:33 PM IST
 వరంగల్‌లో దారుణం:తల్లిని కొట్టి చంపిన  కొడుకు

సారాంశం

భార్యాభర్తలు గొడవ పడకుండా సర్ధి చెప్పేందుకు  ప్రయత్నించిన  తల్లిని కొడుకు రోకలిబండతో  కొట్టి చంపాడు.ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.  నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వరంగల్:  వరంగల్  జిల్లా కేంద్రంలోని లెనిన్ సెంటర్ లో బుధవారం నాడు దారుణం చోటు చేసుకుంది.  తల్లిని  కొడుకు  రోకలిబండతో కొట్టి చంపాడు. లెనిన్ సెంటర్ లో  నివాసం ఉండే కృష్ణ అనే వ్యక్తి ఇవాళ భార్యతో గొడవకు దిగాడు.  భార్యాభర్తలకు నచ్చజెప్పేందుకు  కృష్ణ తల్లి కొమరమ్మ ప్రయత్నించింది.  అయితే  అప్పటికే  ఆగ్రహంగా ఉన్న  కృష్ణ తల్లి కొమరమ్మని  తన చేతిలో  ఉన్న రోకలిబండతో కొట్టి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే   కొమరమ్మ  చనిపోయింది. తల్లి చనిపోయిని విషయం తెలుసుకున్న కృష్ణ అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  కొమరమ్మ మృతదేహన్ని  పోలీసులు  పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?