జీవితంలోనే కాదు ఓటిపి లోనూ సగం ... అందుకే ఆమెను 'అర్థాంగి' అనేది : రాచకొండ  పోలీసుల ఫన్నీ స్టోరీ

By Arun Kumar P  |  First Published Jun 19, 2024, 7:33 PM IST

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా వుండాలని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తుంటారు. అయితే ఈ జాాగ్రత్తలనే కాస్త వినూత్నంగా ఓ ఫన్నీ స్టోరీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసారు రాచకొండ పోలీసులు. 


హైదరాబాద్ : ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరం. స్మార్ట్ ఫోన్ చేతిలో వుందంటే ప్రపంచమే మన చేతిలో వున్నట్లు... ఎలాంటి సమాచారమైన చిటికిలో మన ముందుంటుంది. ఇలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ఇంట్లోనే కూర్చుని అమలాపురం నుండి అమెరికా వరకు ఎక్కడి పనులయినా చేసుకునే వెసులుబాటు లభించింది. ఇదే సమయంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఈ టెక్నాలజీ సాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో టెక్నాలజీని ఉపయోగిస్తూనే కాస్త జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. 

అయితే  బ్యాంకింగ్ సేవలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు మరింత పెరిగిపోయాయి. మన సెల్ ఫోన్ల నే అస్త్రంగా ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించి డబ్బులు ఊడ్చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలా సైబర్ నేరాలు ఇటీవల కాలంలో మరీ ఎక్కువైపోయాయి... బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.  

Latest Videos

undefined

తాజాగా రాచకొండ పోలీసులు కాస్త ఫన్ జోడించి  ఇలాంటి సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేసారు. ఈ స్టోరీ హాస్యాన్ని అందిస్తూనే ఆలోచింపజేసేలా వుంది. చివరగా బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, ఓటిపి, ఏటిఎం పిన్, క్రెడిట్, డెబిట్ కార్టుల వివరాలు ఎవరికీ ఇవ్వొదని రాచకొండ పోలీసులు జాగ్రత్తలు చెప్పారు. 

రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి : 


 

click me!