ఒంటరి మహిళలే టార్గెట్.. కల్లు తాగించి, అత్యాచారం చేసి.. ఆపై..

Published : May 13, 2021, 03:39 PM IST
ఒంటరి మహిళలే టార్గెట్.. కల్లు తాగించి, అత్యాచారం చేసి.. ఆపై..

సారాంశం

యువతులను ట్రాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న హుస్సేన్ ఖాన్ అలియాస్ అలం ఖాన్‌ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచారు.

యువతులను ట్రాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న హుస్సేన్ ఖాన్ అలియాస్ అలం ఖాన్‌ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నారపల్లికి చెందిన హుసేన్ ఖాన్ 2008 నుండి నేరాలకు పాల్పడుతున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో హుస్సేన్ ను అరెస్టు చేశాం. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు.

యువతులను ట్రాప్ చేసి అత్యాచారాలు చేసేవాడు, కల్లు కాంపౌండ్ కు తీసుకెళ్లి వారికి కల్లు తాగించేవాడు. తర్వాత వారిని స్కూటీ మీద బయటకు తీసుకెళ్ళే వాడు. అక్కడ అత్యాచారం చేసి, వారి దగ్గర ఉన్న బంగారం దోచుకునే వాడు.

ఇతనిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్స్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. అతనిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడేలా చూస్తాం. హుస్సేన్ అలీ ఖాన్ వద్ద నుండి 90 గ్రాముల బంగారం, 45 వేల నగదు, మొబైల్ ఫోన్, హోండా యాక్టివా బైక్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu