వామన్ రావు దంపతుల హత్య కేసు : కేసులకు భయపడే అజ్ఞాతంలోకి... పుట్ట మధు

Published : May 12, 2021, 11:33 AM IST
వామన్ రావు దంపతుల హత్య కేసు : కేసులకు భయపడే అజ్ఞాతంలోకి... పుట్ట మధు

సారాంశం

హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. సంబంధం లేనప్పుడు పదిరోజులపాటు ఎందుకు పారిపోయారని.. పోలీసులు ప్రశ్నించగా, కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లానని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కుంట శ్రీను, బిట్టు శ్రీను, ఇతరులు వారి వ్యక్తిగత కారణాల వల్లనే వామన్ రావు దంపతులను హత్య చేసి ఉంటారని పేర్కొన్నట్లు సమాచారం.

దీంతో కేసు పురోగతి దిశగా పోలీసులకు ఆధారాలేమీ లభించలేదని తెలిసింది. మంగళవారం నాలుగో రోజు మధు దంపతులను గంటన్నరపాటు విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు. తామెప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేశారు.

మంగళవారం ఉదయం 11గంటలకు వేర్వేరు వాహనాల్లో వచ్చిన మధు, ఆయన భార్య శైలజ ను పోలీసులు వేరుగానే విచారించారు. ఈ కేసులో వీరి ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఓ అధికారి తెలిపారు.

ఇక ఈ కేసుకు సంబంధించి పలువురు బ్యాంకు ఖాతాలను నాలుగు రోజులుగా పరిశీలించిన పోలీసులు అనుమానాలకు తావిచ్చే  స్థాయిలో లావాదేవీలేవీ లేవని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 39 ఖాతాలను పరిశీలించాల్సి ఉండగా.. ఇంకా 5 ఖాతాల సమాచారం రావాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. దీంతో మరో మూడు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పుట్ట మధు ను ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి రామగుండం తీసుకువచ్చినట్లు ప్రకటించిన పోలీసులు.. సోమవారం రాత్రి వరకు కమిషనరేట్‌లోనే ఉంచి తర్వాత ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. 

రాత్రి 11 గంటల తర్వాత మంథని వచ్చిన మధుకు నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్శిణి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి వచ్చి కలిశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ
Advocate Allam Nagaraju : ఈ వీడియో చూడకపోతే ప్రమాదంలో పడొచ్చు| Asianet News Telugu