రేపు తెలంగాణలో పల్స్ పోలియో...

Published : Feb 26, 2022, 11:43 AM ISTUpdated : Feb 26, 2022, 11:45 AM IST
రేపు తెలంగాణలో పల్స్ పోలియో...

సారాంశం

తెలంగాణ వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.. తల్లిదండ్రులందరూ పిల్లలకు పోలీయో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. 

తెలంగాణ :  Telangana వ్యాప్తంగా రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు Pulse polio కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు వయస్సు ఉన్న 35 లక్షల మంది పిల్లలకు నోటి ద్వారా పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ లైబ్రరీలు, బస్ టెర్మినల్స్, రైల్వే స్టేషన్లు, టూరిజం సెంటర్‌లు వంటి అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 

విమానాశ్రయాలు. పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో తెలంగాణ వ్యాప్తంగా 25 వేల Polio Boothలను ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. 800 మొబైల్ టీమ్‌లు, దాదాపు 8000 మంది సహాయక నర్స్ మిడ్‌వైఫ్ (ANM)లు, 25,000 మందికి పైగా అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్‌లు (ASHA) కార్యకర్తలు పల్స్ పోలియో డ్రైవ్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ driveలో పోలీయో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లలను కవర్ చేయడానికి, టీకాలు వేయడానికి క్షేత్ర స్థాయి కార్యకర్తలు వ్యక్తిగతంగా మురికివాడలు, నిర్మాణ స్థలాలు మొదలైనవాటిని సందర్శిస్తారు. ఈ మేరకు రెండు రోజుల మాప్ అప్ ఎక్సర్ సైజ్ సోమ, మంగళవారాల్లో నిర్వహించబడుతుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి T Harish Rao శుక్రవారం కోరారు. పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా పాల్గొనాలని, పిల్లలతో పాటు తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ బూత్‌ల వద్దకు వచ్చేలా ప్రోత్సహించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన కోరారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా