అనుమానం.. మూడో భార్యను చంపేసి.. టెర్రస్ పై శవాన్ని దాచి..!

Published : Feb 26, 2022, 09:24 AM ISTUpdated : Feb 26, 2022, 09:32 AM IST
అనుమానం.. మూడో భార్యను చంపేసి.. టెర్రస్ పై శవాన్ని దాచి..!

సారాంశం

ఆమె భర్త యాదగిరి(34) ఆమెను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రేఖ.. అతనికి మూడో భార్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది.  

ఓ వ్యక్తి  తన మూడో భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని...  నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోని టెర్రస్ మీద ఆమె శవాన్నిపడేశాడు. చాలా కాలం తర్వాత.. ఆ శవం బయట పడటం గమనార్హం. ఈ సంఘటన హైదరాబాద్ లోని  ఎంఐజీ కాలనీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చనిపోయిన మహిళ రేఖ( 30) గా గుర్తించారు. ఆమె డైలీ లేబర్ గా పనిచేస్తుంది. ఆమె భర్త యాదగిరి(34) ఆమెను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రేఖ.. అతనికి మూడో భార్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది.

యాదగిరి కి మొదటి నుంచి భార్య రేఖ పై అనుమానం ఎక్కువ. ఈ నేపథ్యంలో మొదటి నుంచి భార్యను హింసిస్తూ ఉండేవాడు. కాగా.. ఫిబ్రవరి 18వ తేదీన యాదగిరి.. భార్య రేఖను.. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య ఎప్పటిలానే గొడవ జరిగింది.

ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన యాదగిరి.. రేఖ తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో.. తలకు తీవ్ర గాయమై ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమీపంలోని సీసీటీవీ కెమేరాల్లో అంతా రికార్డు కావడం గమనార్హం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Airport: హైద‌రాబాద్ ఒక్క‌టే కాదు.. ఈ ప్రాంతాల్లో కూడా రియ‌ల్ బూమ్ ఖాయం. కొత్త ఎయిర్ పోర్టులు
VB-G RAM G : కూలీలకు నిరుద్యోగ భృతి.. అందకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి